గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన హైందవ శంఖారావం బహిరంగ సభకు భక్తులు భారీగా తరలి వచ్చారు. హైందవ మహా సభా ప్రాంగణం దాదాపు పూర్తిగా నిండిపోయింది. దేశం నలుమూలల నుండి మహిళ భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమన్ కి శ్రీరామ్ అనే నినాదాలతో సభ ప్రాంగణానికి ప్రజలు చేరుకున్నారు.