గుడివాడ పట్టణంలోని ఓల్డ్ మున్సిపల్ కార్యాలయం వద్ద గల శ్రీ కోదండ రామాలయంలో 80వ వార్షిక ధనుర్మాసోత్సవాలు వైభవోపేతంగా ముగియడంతో శాంతి నిమిత్తం శుక్రవారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ శ్రీ కోదండ రామ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.