రోడ్లపై ఇష్టం వచ్చినట్లు చెత్త వేస్తూ అపరిశుభ్ర వాతావరణానికి కారణం అవుతామంటే ఊరుకునే ప్రసక్తి లేదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హెచ్చరించారు. చిరు వ్యాపారులతో సహా రోడ్ల వెంబడి వ్యాపారులకు చెప్పాల్సిందంతా చెప్పామని అయినా మార్పు రాకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీకోసం మీ వెనిగండ్ల ఉదయపు పర్యటనలు ఆదివారం 10వ రోజుకు చేరుకున్నాయి.