కటారి సత్యనారాయణ, రావి శోభనాద్రి పేర్లు పెట్టాలి

51చూసినవారు
కటారి సత్యనారాయణ, రావి శోభనాద్రి పేర్లు పెట్టాలి
గుడివాడ మున్సిపల్ కార్యాలయానికి స్వర్గీయ సర్దార్ కటారి సత్యనారాయణ, రాజేంద్రనగర్ పార్క్ కు స్వర్గీయ రావి శోభనాద్రి చౌదరి పేర్లు పెట్టాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రతిపాదించారు. ఆదివారం ప్రతిపాదన లేఖపై శాసనసభ్యులు రాము సంతకం చేశారు. ప్రతిపాదన లేఖను తన ప్రతినిధుల ద్వారా మున్సిపల్ కమిషనర్ కు పంపారు.

సంబంధిత పోస్ట్