ఇది రహదారి కాదు. యమలోకానికి రహదారి. అంటూ పలువురు వాపోతున్నారు. గుడివాడ నుంచి వెంటప్రగడ, మానికొండ మీదుగా విజయవాడ వెళ్లే ప్రయాణికులు ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. గుడివాడ విజయవాడ వెళ్లే మార్గాన్న ఎంతోమంది ప్రజలు బస్సులలో సొంత వాహనాలలో నిత్యము ప్రయాణం చేస్తూ ఉంటారు. క్షేమముగా ఇంటికి చేరేవరకు ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.