జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెట్టి సాంప్రదాయం పేరుతో నిర్వహించిన కోడిపందాల బరులు అనేక ఘర్షణలకు, దాడులకు, వివాదాలకు కారణమై నిర్వాహకులు అప్రతిష్ట మూటగట్టుకున్నారు. షేర్ మహమ్మద్ పేట గ్రామంలో నిర్వహించిన కోడి పందాల బరులలో బుధవారం జరిగిన వివాదం గ్రామములో రెండు కులాల మధ్య ఘర్షణకు కారణమై గాయాలై ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం.