జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీలను మంగళవారం నిర్వహించారు. నందిగామ డివిజన్ తనిఖీదారు, సేవా సమితి వారి సమక్షంలో హండి లు తెరిచి లెక్కించగా 25 లక్షల 27 వేల 733 రూపాయలు, బంగారం 45 గ్రాములు, వెండి 220 గ్రాములు, శివాలయం హుండీ రూ. 35678/ లు, అన్నదానం హుండీ రూ. 49637/- వెరసి రూ. 2613048/- వచ్చి ఉన్నవని, ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్ భరద్వాజ్ తెలిపారు.