దాతృత్వం చాటుకున్న వైద్యురాలు

1859చూసినవారు
దాతృత్వం చాటుకున్న వైద్యురాలు
కృష్ణాజిల్లా జగ్గయ్య పేట మానవత్వమే అభిమతంగా డాక్టర్ బొజ్జ రాజేష్- సౌమ్య దంపతులు సేవలో ముందడుగు వేస్తున్నారు. మండల పరిధిలోని చిల్లకల్లు గ్రామానికి చెందిన షేక్ మల్సూర్ వయసు 45 ఆటో తోలుతూ భార్య సైదాబీ పిల్లలు నూర్జహాన్, సల్మా, కరిష్మా కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవనం సాగిస్తున్న తరుణంలో అనారోగ్యం బారిన పడి మల్సూర్ కు ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఆ తర్వాత రెండు సంవత్సరాల నుండి అనేకరకాల ఇబ్బందులతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. భర్త మంచాన పడటంతో బాధ్యతలు భుజంపై వేసుకున్న భార్య సైదాబీ ఉదయం నాలుగు గంటల నుండి సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో రోజువారీ కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. మల్సూర్ -సైదాబీ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు పెద్ద కూతురు నూర్జహాన్ తొమ్మిదవ తరగతి రెండవ కూతురు సల్మా ఎనిమిదవ తరగతి మూడవ కూతురు కరిష్మా ఏడవ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. భర్తకు వైద్య ఖర్చులు మందుల నిమిత్తం నెలకు ఐదు వేల వరకు ఖర్చు అవుతుందని తనకు వచ్చే రోజు వారి కూలీ తో కుటుంబాన్ని పోషించలేక పోతున్నట్లు సైదాబీ తెలిపింది. వారికి ఎటువంటి ఆస్తులు బంధువుల అండా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో జీవనం సాగిస్తున్నారు. దాతలు ఈ విషయంలో ముందుకు వచ్చి ముగ్గురు ఆడపిల్లలు కలిగిన ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని నింపి ఆసరాగా నిలవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. సామాజిక మాధ్యమాలలో కథనాలను చూసి స్పందించిన జగ్గయ్యపేట ప్రముఖ దంత వైద్య నిపుణులు బొజ్జ రాజేష్ బొజ్జ సౌమ్య దంపతులు చిల్లకల్లు గ్రామంలోని షేక్ మల్సూర్ కుటుంబాన్ని నేరుగా కలిసి వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందజేయడమే కాకుండా వారి కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో తమ వంతు సహకారాన్ని బొజ్జ డెంటల్ హాస్పిటల్ ద్వారా అందిస్తామని తెలియజేశారు. విభిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న బొజ్జ దంపతులకు కుటుంబ సభ్యులు చిల్లకల్లు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్