ఏళ్లు తరబడి కోమటిలంక గ్రామస్తులు వంతెన లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వ పట్టించుకోరా అంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కైకలూరు మండలం ఆటపాక నుండి కోమటిలంక వెళ్లే దారిలో పోల్ రాజ్ కాలువపై ఏళ్ల తరబడి వంతెన నిర్మాణం జరగక ఆ గ్రామస్తులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించాలన్నారు.