కైకలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్. జితేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్స్, మెడ్స్ ఫార్మసీ వంటి సంస్థల్లో 100 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. పదో తరగతి ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఫార్మసీ చదివిన 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు.