కైకలూరు: 40 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు

81చూసినవారు
కైకలూరు: 40 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు
రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు చూడాలన్నదే కూటమి ప్రభుత్వం ధ్యేయం అనే నినాదంతో నియోజకవర్గంలో పలు చోట్ల నూతన రోడ్లు నిర్మాణం జరుగుతుందని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈ క్రమంలో మంగళవారం కైకలూరు మండలం ఆటపాక శివారు అగ్రహారం నుంచి వరహాపట్నం గ్రామం వరకు రూ. 40, 00, 000 నిధులతో తారు రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా గ్రామస్థులు, వాహన దారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్