ప్రధాని నరేంద్ర మోదీ ముందు చూపుతో భాజపా పాలనలో దేశం సుభిక్షంగా ఉందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ వెంపాటి విష్ణురావు ఆధ్వర్యంలో స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో పార్టీ సభ్యత్వాన్ని ఎమ్మెల్యే నమోదు చేయించుకున్నారు. ప్రజలు సభ్యత్వాన్ని నమోదు చేసుకుని నవభారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.