ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, విద్య ద్వారా ఎందరినో ప్రయోజకుల్ని చేసే రూప శిల్పి ఉపాధ్యాయుడేనని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి అన్నారు. ఆదివారం మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశ భావి భారత పౌరులను తీర్చిదిద్దే మేధావులని కొనియాడారు. నేటి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయని తెలిపారు.