పింగళి వెంకయ్య పేరు ప్రకటించడం సంతోషంగా ఉంది: ఎంపీ

63చూసినవారు
పింగళి వెంకయ్య పేరు ప్రకటించడం సంతోషంగా ఉంది: ఎంపీ
మువ్వన్నెల జాతీయ పతాకం రూపశిల్పి, స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్య పేరుని మచిలీపట్నం మెడికల్ కళాశాలకు పెడుతున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. బుధవారం గాంధీ జయంతి సందర్బంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ, సీఎంను కోరిన వెంటనే ఆ పేరు ప్రకటించటం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్