ఎన్ఎంఎంఎస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఈ నెల 24 వరకే ఉందని జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెరా సుల్తానా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయుటకు విద్యార్థుల కుల, ఆదాయ సర్టిఫికెట్ లను అప్లోడ్ చేయవలసిన పనిలేదన్నారు. కేవలం విద్యార్థి సంతకంతో ఉన్న పాస్ పోర్ట్ సైజు ఫోటో మాత్రమే అప్లోడ్ చేస్తే సరిపోతుందన్నారు. పొడిగించిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.