ఎస్జిటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షేక్ షాహిద్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. శిక్షణలో చేరే విద్యార్థులు ఈ నెల 21 లోపు జ్ఞానభూమి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 27న స్కీనింగ్ పరీక్ష నిర్వహంచి మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు.