అక్రమ లేఔట్ పై చర్యలకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేశారు. మచిలీపట్నంలోని చిలకలపూడి వద్ద రాజు హాస్పిటల్ దగ్గర వైసీపీ నాయకులు అనుమతి లేకుండా లేఅవుట్ను ఏర్పాటు చేశారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ఆదేశాల మేరకు చర్యలకు సిద్ధమయ్యారు. అనుమతి లేకుండా వేసిన లేఔట్ ను ఆదివారం మున్సిపల్ అధికారులు స్వయంగా పరిశీలించారు. ఈ లేఔట్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని బ్యానర్లు ఏర్పాటు చేశారు.