మచిలీపట్నం: జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పి

63చూసినవారు
మచిలీపట్నం: జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పి
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శనివారం మచిలీపట్నంలో ఒక ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి పండుగను ప్రజలందరూ ఆనందంతో జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ పండుగ అందరికీ కొత్త విజయాలు చేకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్