కొనసాగుతున్న పేదలకు ప్రేమవిందు

652చూసినవారు
కొనసాగుతున్న పేదలకు ప్రేమవిందు
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలం, రెడ్డిగూడెంలో గల ఫ్రెండ్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ డేకేర్ సెంటర్ నందు నిరుపేదలైన వారికి 'ప్రేమవిందు' (అన్నదానం) నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు చాట్ల విజయకుమార్ ఆదివారం మాట్లాడుతూ తమకు కలిగిన ఆర్థిక స్థోమతను బట్టి తమతోటి నిరుపేదలైన వారికి నిరంతరం 'ప్రేమవిందు' పేరుతో అన్నదానం కొనసాగిస్తూ ఉన్నామనీ, కొన్ని సందర్భాల్లో కొందరు దాతలు తమ కుటుంబాలలో జరిగే కొన్ని కార్యక్రమాల సందర్భంగా వారు కూడా పేదలైన వారికి అనేక రకాలుగా తమ సంస్థ ద్వారా ఉపయోగ పడుతున్నారనీ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్