ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరు గ్రామపంచాయతీ శివారు సాయన్నపాలెం గ్రామంలో రూ. 48 లక్షల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 1050 మీటర్ల పొడవునా వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సిమెంట్ రహదారులను ఆయన శనివారం ప్రారంభించారు.