లయన్స్ క్లబ్ ఆఫ్ కొండపల్లి ఇండస్ట్రియల్ పార్కు నూతన అధ్యక్షుడిగా రేగళ్ల రఘునాథరెడ్డి ఆదివారం ఎన్నికయ్యారు. పారిశ్రామికవాడలోని ఐలా కార్యాలయంలో లయన్స్ క్లబ్ సమావేశం జరిగింది. లయన్స్ జిల్లా గవర్నర్ జేఎన్ శంకర్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఎ. సురేష్, కోశాధికారిగా షేక్ జాకీర్ హుస్సేన్లను తిరిగి ఎన్నుకున్నారు.