జి. కొడూరు మండలం కోడూరు గ్రామంలో నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జి. కొండూరు మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ పాల్గొని స్థానిక సర్పంచ్, ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి లబ్ధిదారులకు ధ్రువ పత్రాలు పంపిణి చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు.