వరద బాధితులకు ప్రైవేటు పాఠశాలల సంఘం బాసట

50చూసినవారు
వరద బాధితులకు ప్రైవేటు పాఠశాలల సంఘం బాసట
ప్రభుత్వ పిలుపునకు స్పందించిన ఎందరో దాతలు వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. మంగళవారం నందిగామ నియోజకవర్గంలోని నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, కంచికచర్ల మండలాలకు చెందిన ప్రైవేటు పాఠశాలల సంఘం సీఎంఆర్‌ఎఫ్‌ పేరుతో విరాళాల చెక్కును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అందజేశారు. స్థానిక కాకానీ నగర్ కార్యాలయంలో తంగిరాల సౌమ్యను మర్యాదపూర్వకంగా కలిసి రూ. 13 లక్షల 76వేల రూపాయల చెక్కును అందించారు.

సంబంధిత పోస్ట్