నందిగామ నియోజకవర్గం పరిధిలో గల కంచికచర్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వీరులపాడు మండలం దాచవరం గ్రామంలో శుక్రవారం ఒక వ్యక్తి వద్ద నుండి ఏడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ అశ్రపున్నిసా బేగం మాట్లాడుతూ.. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.