నందిగామ పట్టణం కాకాని నగర్ లోని టీడీపీ కార్యాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి శాసనసభ్యులు తంగిరాల సౌమ్య టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ పార్టీ సభ్యత్వాన్ని రూ. 100 రుసుముతో రూ. 5 లక్షల మేర బీమా సౌకర్యం పొందవచ్చు అని తెలిపారు. రికార్డు స్థాయిలో సభ్యత్వాన్ని నమోదు చేయాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.