నూజివీడు మండలం మీర్జా పురం గ్రామంలో ఒక వ్యక్తిపై మరొక వ్యక్తి దాడి చేసి గాయపరిచిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సయ్యద్ బాజీ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన షేక్ కరుణాకర్ అనే వ్యక్తి గత రాత్రి ఇంటి గోడ దూకాడు. గోడ ఎందుకు దూకేవని ప్రశ్నించగా, బాజీ తనపై దాడి చేసినట్లు బాధితుడు కరుణాకర్ నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు నూజివీడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.