పామరు నియోజకవర్గంలో పొగ పెట్టవద్దని విభజించి పాలించే పనులు చేయవద్దని పామర్రు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపాటి సుబ్బారావు కోరారు. ఈ మేరకు ఆయన శనివారం డిసిసి అధ్యక్షులు గొల్లు కృష్ణకి విన్నపం చేశారు. పిసిసి అధ్యక్షులు షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గాల్లో ఇన్చార్జి ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని తెలియజేయగా ఆ ప్రక్రియ పామర్రు నియోజకవర్గంలో అందుకు భిన్నంగా జరగడం శోచనీయమన్నారు.