పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పమిడిముక్కల మండలం ఐనపూరు వద్ద సోమవారం వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కుమార్ రాజా మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో ఎటువంటి లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.