భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని మన్మోహన్ సింగ్ వినయానికి, విజ్ఞానానికి, సమగ్రతకు ప్రతి రూపమని ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.