సాంఘిక నాటకాలకు అనుమతులు, ఆంక్షలు సమంజసం కాదని పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డివై దాస్ ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ మేరకు ఆయన సోమవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. అనుమతులు ఆంక్షలు అంటూ కుంతీదేవి (గొంతెమ్మ) పండుగలకు సాంఘిక నాటకాల్ని అడ్డుకోవడం ఏమాత్రం సమంజసం కాదని, కుంతీదేవి పండుగ ఎస్సీల మనోభావాలకు సంబంధించిన అంశం అన్నారు.