సంక్రాంతి సంబరం పామర్రు నియోజకవర్గంలో అంబరానంటాయి. కోళ్లు కత్తులు దూయటంతో వందల కోట్లు చేతులు మారాయి. పామర్రు నియోజకవర్గంలో కోడిపందేలు, గుండాటలు, పేకాటల్లో ఎన్ని కోట్లు చేతులు మారతాయో లెక్కగట్టి చెప్పేందుకు ప్రత్యేకంగా మనుషులేం ఉండరు. బరిలో తీస్తున్న నోట్ల కట్టలు, పెడుతున్న పందేలను చూస్తే ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో అంచనా వేయొచ్చు. వందల కోట్ల రూపాయల దాకా చేతులు మారి ఉంటాయని అంచనా వేస్తున్నారు.