ఈనెల 9, 10, 23, 24 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం పెదపారుపూడిలో విలేకరులతో మాట్లాడుతూ ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన పౌరులందరూ తప్పనిసరిగా తమ ఓటును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు.