బంటుమిల్లి కాలువ కింద బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల పరిధిలో రెండవ పంటలో వరి సాగుకు నీరందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా రబీలో సాగునీరు అందించకపోవడంతో ఇప్పటికే పొలాల చౌడు భూములుగా మారాయన్నారు.