కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కేంద్రాలను పేరు మారుస్తూ రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చారు. కానీ పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలంలో రైతు భరోసా కేంద్రాలుగానే కొనసాగించడంపై పలువురు రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్య ధోరణితో రైతు సేవా కేంద్రాలుగా మార్చకుండా అలాగే ఉంచారని కూటమి నేతలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.