ప్రగతి కోసం, పచ్చదనం కోసం ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటాలని పెడన నియోజవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం పెడన రూరల్ మండలం నేలకొండపల్లి గ్రామం నందు వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న రోజుల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.