సహకార బ్యాంక్లోని సుమారు రూ. 39 లక్షల నిధులు గోల్ మాల్ అయిన ఘటన పెడన నియోజకవర్గం ముచ్చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బ్యాంకులో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ సాయిబాబును వివరణ కోరగా బ్యాంకులో పనిచేస్తున్న మధు అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. ఇప్పటికే మధును సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నామన్నారు.