గూడూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

73చూసినవారు
గూడూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం గూడూరు మండలం కంకటావ గ్రామంలో రూ. 34 లక్షలతో కంకటావ శివారులోని కత్తులవానిపాలెం గ్రామం వరకు నిర్మించిన నూతన అంతర్గత రహదారిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా నిధులను వెచ్చించి అంతర్గత రహదారులను సిసి రహదారులుగా మారుస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్