మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం పెడన పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ స్థితిగతులను మార్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి వ్యవస్థలను బలోపేతం చేసిన మౌనముని మన్మోహన్ అని పేర్కొన్నారు. ఆయన ఆదర్శాలు ఎనలేనివని కొనియాడారు.