పెడన: భారీగా సభ్యత్వాలు నమోదు చేయించాలి

78చూసినవారు
పెడన: భారీగా సభ్యత్వాలు నమోదు చేయించాలి
పెడన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును భారీ స్థాయిలో చేయించాలని పార్టీ శ్రేణులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ సూచించారు. శనివారం పెడనలో ఆయన మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. రూ. 100తో సభ్యత్వాలు నమోదు చేయడం ద్వారా ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. సభ్యత్వాల నమోదులో జిల్లాలో పెడన నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్