నాటు సారా నియంత్రణలో గ్రామస్థులు భాగస్వాములు కావాలని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ భార్గవ పిలుపునిచ్చారు. నవోదయ 2. 0 కార్యక్రమంలో భాగంగా బుధవారం పెడన మండల పరిధిలోని డీటీపాలెం, నందమూరి గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించారు. నాటు సారా తయారీదారులపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.