గ్రామాల్లో నిర్వహించే రెవిన్యూ సదస్సులకు అందిన ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని పెడన తహశీల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులో భాగంగా శుక్రవారం చోడవరం, పుల్లపాడు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ గ్రామస్థాయిలోని భూ సమస్యల తక్షణ పరిష్కారం లభించడం కోసం ప్రభుత్వం ఈ సదస్సులు నిర్వహిస్తుందన్నారు.