పెడన: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

81చూసినవారు
పెడన పట్టణంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున స్వామివారి ఉత్తర ద్వారం భక్తుల దర్శనార్థం తెరవడం ద్వారా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. భక్తులు ప్రత్యేక పూజలు, హారతులతో వేణుగోపాల స్వామి సేవలో పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్