ఉయ్యూరు: బంగారం దొంగలించిన కేసులో ఒకరి అరెస్ట్

78చూసినవారు
బంగారం దొంగలించిన కేసులో మంగళవారం ఉయ్యూరు రూరల్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. మండలంలోని కాటూరు గ్రామంలో ఒక ఇంటిలో 90 గ్రాములు బంగారం దొంగలించిన అదే గ్రామానికి చెందిన కొత్తూరు మధుబాబుని అరెస్టు చేసి 6, 30000 రూపాయల విలువచేసే 90 గ్రాములు బంగారం రికవరీ ఉయ్యూరు పోలీసులు చేశారు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న టీముకు క్యాష్ రివార్డ్ అందజేశారు. ముద్దాయిని పోలీసులు ఉయ్యూరు కోర్టులో హాజరు పరిచారు.

సంబంధిత పోస్ట్