సీఎం చంద్రబాబు వరద బాధితులకు ప్యాకేజీని ప్రకటించారని రాష్ట్ర సమాచార పార సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. ఆదివారం తాడిగడపలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వంద రోజుల పాలనలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని తెలిపారు.