పెనమలూరు :11 రోజుకి చేరుకున్న వ్యాన్ డ్రైవర్ల సమ్మె

63చూసినవారు
తాడిగడప మున్సిపాలిటీలోని తడి పొడి చెత్త వ్యాన్ డ్రైవర్ల సమ్మె సోమవారం 11 రోజుకి చేరుకుంది. తాడిగడప మున్సిపాలిటీలో తడి పొడి చెత్త సేకరించే వ్యాన్ డ్రైవర్లకు మూడు నెలలు అవుతున్న ఇంతవరకు జీతాలు చెల్లించకపోవడంతో 42 మంది వ్యాన్ డ్రైవర్లు సమ్మెబాట పట్టడం జరిగింది. దానిలో భాగంగా సోమవారం కానూరు నాలుగు రోడ్లు సెంటర్లో కార్మికులు నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్