గంగూరు సబ్ స్టేషన్ ఏఈ కార్యాలయం వద్ద శుక్రవారం పెనమలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోరుబాటను నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ కూటమి ఎన్నికల ప్రచారంలో షూరిటీ అని గ్యారెంటీ హామీలు ఇచ్చి నేడు అధికారం వచ్చిన నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూన్నారని ఆరోపించారు. కరెంట్ చార్జీలను పెంచమని ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.