విలువలు, ఆదర్శప్రాయంతో కూడిన విద్య సమాజానికి ఎంతో అవసరమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఉయ్యూరు మండలo మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కొలసాని రవి కుమార్ ఆధ్వర్యంలో ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలోని ప్రభుత్వ హైస్కూలు నందు పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసంపై సోమవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.