పెనమలూరు గ్రామం మహిళా మండల్ కట్టవద్ద గల కాలవలో దూకి ఒక వృద్ధుడు సోమవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అతను దూకిన వెంటనే కాలువలో పడకుండా మధ్యలో ఉన్న ముళ్ళపొదలో చిక్కుకున్నాడు. కాలువ పక్కన ఉన్న శ్రీకృష్ణ ఆలయంలోని భక్తులు, కొంతమంది స్థానికులు చూసి అతని వెంటనే పైకి లాగారు. తన అప్పులు బాధ, కుటుంబంలో వ్యక్తిగత కారణాల వల్ల అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.