ఏ. కొండూరులో సారా తయారీ కేంద్రాలపై దాడులు

64చూసినవారు
తిరువూరు ఎక్సైజ్ శాఖ పరిధిలోని ఏ కొండూరు మండలం గొల్లమంద తండాలో ఆదివారం ఎక్సైజ్ శాఖ అధికారులు, సారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 150 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సారా తయారుచేసిన అమ్మకాలు చేపట్టిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్