పెనుగొలనులో ఆంధ్ర పితామహ మాడపాటి జయంతి

71చూసినవారు
పెనుగొలనులో ఆంధ్ర పితామహ మాడపాటి జయంతి
గంపలగూడెం మండలం పెనుగొలనులో బుధవారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాడపాటి ప్రజలను చైతన్యపరచుటకు అనేక రచనలు చేశారని, రాష్ట్ర విధానమండలి తొలి అధ్యక్షులు, హైదరాబాదు తొలి మేయర్ గా విశేషమైన సేవలు అందించారని టీచర్ కె‌ లింగమ్మ తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్